Telangana8th Dec 02:48 PMSunil Byrisetty1 min read
పంచాయతీ ఎన్నికల ఆఫర్లు.. ఓటర్లకు చికెన్, మద్యం
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో తాయిలాల పంపిణీ జోరుగా మొదలైంది. ఇంటింటి ప్రచారం జోరందుకుంది. మొదటి విడత ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇంటింటికీ టీ, ట
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో తాయిలాల పంపిణీ జోరుగా మొదలైంది. ఇంటింటి ప్రచారం జోరందుకుంది. మొదటి విడత ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇంటింటికీ టీ, టిఫిన్లు, మధ్యాహ్నం అరకిలో చికెన్, రాత్రికి మద్యం పంపిణీ చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమను గెలిపిస్తే గ్రామంలో వినాయక, దుర్గామాత విగ్రహాలు సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తామని, ప్రతి మండపానికి రూ.10 వేలు అందిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.