News11th Dec 03:01 PMSunil Byrisetty1 min read

రాయచోటిలో పంచాయితీ రాజ్ రోడ్లకు మహర్దశ

అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గ రూపు రేఖలు మార్చేందుకు రోడ్లను మంజూరు చేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదా

రాయచోటిలో పంచాయితీ రాజ్ రోడ్లకు మహర్దశ
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గ రూపు రేఖలు మార్చేందుకు రోడ్లను మంజూరు చేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 38.08 కిమీ మేరకు 12 గ్రామీణ రహదారులకు రూ. 21.16 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ మంజూరు చేసింది. రహదారుల మంజూరుకు కృతజ్ఞతలు తెలుపుతూ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతిలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని హోం మంత్రి అనితతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోడ్ల నిర్మాణం ద్వారా రాయచోటిలో గ్రామీణ రవాణా సౌకర్యాలు, అభివృద్ధికి కొత్త ఊపు తీసుకురానుంది అని మంత్రి తెలిపారు.
Andhra Pradesh
Rayachoti
Annamayya District
Panchayat Raj
Rural Roads
Pawan Kalyan
Mandipalli Ramprasad Reddy
రాంప్రసాద్ రెడ్డి
మౌలిక సదుపాయాలు
గ్రామీణ రవాణా
Scroll for the next article