Crime10th Apr 04:25 PMSunil Byrisetty1 min read
ఆయనో పంచాయతీ కార్యదర్శి.. ఆస్తులు మాత్రం రూ. 85 కోట్లు!
పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం అంటే వేలల్లో జీతం ఉంటుంది. కొన్నేళ్లకు లక్షల విలువైన ఆస్తులు సంపాదించుకోగలరు. కానీ ఓ పంచాయతీ కార్యదర్శి కూడబెట్టిన ఆస్తుల లెక్క చూస్తే కళ్లు తేలేయాల్సింద
పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం అంటే వేలల్లో జీతం ఉంటుంది. కొన్నేళ్లకు లక్షల విలువైన ఆస్తులు సంపాదించుకోగలరు.
కానీ ఓ పంచాయతీ కార్యదర్శి కూడబెట్టిన ఆస్తుల లెక్క చూస్తే కళ్లు తేలేయాల్సిందే.
తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ ఈవోగా పనిచేసిన మహేశ్వరయ్య లంచాలకు మరిగాడు.
ఫిబ్రవరిలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన తీరుపై అనుమానంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కూపీ లాగారు.
తిరుపతి రూరల్ మండలం పేరూరు జర్నలిస్టు కాలనీలో ఉన్న మహేశ్వరయ్య ఇల్లు, గంగవరం సమీపంలోని ఫామ్‌హౌస్, అత్తగారింట్లో సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో కిలో బంగారం, వెండి, రూ.2 లక్షల వరకూ నగదు, రూ.35 లక్షల టర్మ్ డిపాజిట్ల బాండ్లు స్వాధీనం చేసుకున్నారు.
రెండు కార్లు, బైక్‌లను సీజ్ చేశారు.
మహేశ్వరయ్యకు పలమనేరులో రూ.3 కోట్లు విలువ చేసే మూడంతస్థుల ఇల్లు, ఫాంహౌస్, బినామీ పేర్లతో భూములు, ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.
గంగవరంలో వ్యవసాయ భూమితో పాటుగా కోళ్లఫారం, స్థిరచరాస్థులు, బెంగళూరులో రూ.10 కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్ ఉన్నట్లు బయటపడింది.
మొత్తంగా ఈ పంచాయతీ కార్యదర్శికి రూ.85 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది