News3rd Nov 11:10 AMSunil Byrisetty1 min read
పాపికొండల పర్యాటకం.. బోటింగ్ షురూ
గోదావరి నదిలో సాగే పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. దీపావళికి ముందే ఈ బో
గోదావరి నదిలో సాగే పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది. ఈ సీజన్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాపికొండల్లో విహరిస్తారని అధికారులు చెబుతున్నారు.