Entertainment24th Sep 11:26 AMSunil Byrisetty1 min read

పారడైజ్.. ముందొచ్చిన హైప్ ఉందా?

ఈ మ‌ధ్య ‘పార‌డైజ్’ సినిమాకు వ‌చ్చిన క్రేజ్ మ‌రే సినిమాకూ రాలేదు. కేవ‌లం జ‌డ‌ల లుక్, రెండు పాట‌ల‌తో ఇంత హైప్ తెచ్చుకోగ‌లిగింది. ట్రైల‌ర్ లేకుండానే ఈ సినిమా గురించి జ‌నం ఎదురు చూసేలా

పారడైజ్.. ముందొచ్చిన హైప్ ఉందా?
ఈ మ‌ధ్య ‘పార‌డైజ్’ సినిమాకు వ‌చ్చిన క్రేజ్ మ‌రే సినిమాకూ రాలేదు. కేవ‌లం జ‌డ‌ల లుక్, రెండు పాట‌ల‌తో ఇంత హైప్ తెచ్చుకోగ‌లిగింది. ట్రైల‌ర్ లేకుండానే ఈ సినిమా గురించి జ‌నం ఎదురు చూసేలా చేసింది. నాని కెరీర్‌లో కాస్ట్లీ సినిమా ఇది. కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం నిరాశనే మిగిల్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా త‌మ వ‌ర‌కూ రాని స‌వారీ జాతి క‌థ ఇది. హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న పార‌డైజ్ ప్రాంతం అది. దాదాపు 5 వేల‌మంది స‌వారీలు అక్క‌డ ఎలాంటి గుర్తింపు లేకుండానే బ‌తికేస్తుంటారు. ఆ ప్రాంతాన్ని మోహ‌న్ బాబు నియంత‌లా ప‌రిపాలిస్తుంటాడు. స‌వారీల‌కు ఎట్టిప‌రిస్థితుల్లోనూ గుర్తింపు రాకుండా చూసుకొంటుంటాడు. స‌వారీ జాతిలో జ‌డ‌ల్ (నాని) చిన్న‌ప్పుడే హత్యానేరంపై జైలుకి వెళ్లి ప‌ద్నాలుగేళ్ల త‌ర‌వాత తిరిగొస్తాడు. త‌న ఆశ‌యం షికంజాని చంప‌డ‌మే. అందుకోసం జ‌డ‌ల్ ఏం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Scroll for the next article