News27th Mar 02:37 PMSunil Byrisetty1 min read

స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్‌కు రూ.50 లక్షల విరాళం

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పలు సంస్థలు విరాళాలు అందజేస్తున్నాయి. ఈ నిధులతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు వెచ్చించనున్నారు. తాజాగా స్మార్ట్ ఆంధ్రప్

స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్‌కు రూ.50 లక్షల విరాళం
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పలు సంస్థలు విరాళాలు అందజేస్తున్నాయి. ఈ నిధులతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు వెచ్చించనున్నారు. తాజాగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం అందజేసింది. ఈ మేరకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద స్వరూప్ అదవానీ ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్ అందజేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు విరాళం అందజేసిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ ప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు.
Devarapalli
Nara Lokesh
Paramesu Biotech Limited
ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్
Scroll for the next article