Crime3rd Apr 04:06 PMSunil Byrisetty2 min read

పరిటాల రవి హత్యలో జగన్ హస్తం? సునీత సంచలనం

పరిటాల రవీంద్ర హత్యలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి కూడా పాత్ర ఉందంటూ ఆయన భార్య, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోజు సీబీఐ సైతం జగన్‌ని కూడా విచారించిందన్నారు.

పరిటాల రవి హత్యలో జగన్ హస్తం? సునీత సంచలనం
పరిటాల రవీంద్ర హత్యలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి కూడా పాత్ర ఉందంటూ ఆయన భార్య, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోజు సీబీఐ సైతం జగన్‌ని కూడా విచారించిందన్నారు. టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలని, సూట్ కేస్ బాంబు కూడా ఎవరు పెట్టారో చెప్పాలని నిలదీశారు. తోపుదుర్తి సోదరులు తమ స్వార్థం కోసం ఫ్యాక్షన్ని రెచ్చగొడుతున్నారని, ఓబుల్ రెడ్డి, మద్దలచెరువు సూరి కుటుంబాలను ఇందులోకి లాగుతున్నారని వ్యాఖ్యానించారు. గంగుల భానుమతి, కనుముక్కల ఉమాకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఫ్యాక్షన్ కారణంగా మన మూడు కుటుంబాలు నష్టపోయాయని, దీని నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని అన్నారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో తోపుదుర్తి సోదరులు మళ్ళీ ఇందులోకి లాగుతున్నారన్నారు. వారి మాటలు నమ్మి.. ఈ కుట్రలో భాగస్వామ్యం కావద్దని కోరారు. ఫ్యాక్షన్‌ని రెచ్చగొట్టి చలి కాచుకోవాలని చూస్తున్నారని, పాపంపేటలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇళ్లు కూల్చివేశారని, ఇది జరిగిన మూడు రోజుల తర్వాత బాధితులను రెచ్చగొడుతున్నారని వివరించారు. తమ కుటుంబం ఇచ్చే కుటుంబం కానీ తీసుకునేది కాదని, ఎంపీపీ ఎన్నిక విషయంలో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఒకవేళ చేసుకొని ఉంటే కచ్చితంగా రామగిరి ఎంపీపీ టీడీపీకే దక్కేదన్నారు. వారి ఎంపీటీసీల మీద వారికే నమ్మకం లేక క్యాంపులకు తరలించారన్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై తోపుదుర్తి ఎలా మాట్లాడారో అంతా చూశారని, ఇప్పుడు కేసుల భయంతో మర్యాదగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తోపుదుర్తి సోదరులు ఏది చెబితే అదే జగన్ మాట్లాడుతున్నారని, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసినా వాస్తవాలు తెలుసుకోరా అని ప్రశ్నించారు. జగన్‌కి శుక్రవారం కలిసి వచ్చినట్టుందని, అందుకే శుక్రవారం రోజు పాపిరెడ్డిపల్లికి వస్తానంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ లింగమయ్యతో పాటు వైసీపీ బాధితులను కూడా పరామర్శించాలని జగన్‌కు సూచించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో జగన్ వచ్చి ఫ్యాక్షన్ రగిలించవద్దని సూచిస్తున్నామని సునీత పేర్కొన్నారు.
Paritala Sunitha
Paritala Ravi Murder case
YS Jagan
AP Politics
Scroll for the next article