News20th Jan 05:03 PMSunil Byrisetty1 min read
28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఈ నెల 27న అఖిలపక్ష భేటీకి హాజరు కావాలని, లోక్‌సభలో
ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఈ నెల 27న అఖిలపక్ష భేటీకి హాజరు కావాలని, లోక్‌సభలో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపింది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సహకరించాలని కేంద్రం కోరనుంది. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే బిల్లుల వివరాలు విపక్షాలకు ఇవ్వనుంది. దేశంలో పలు పరిణామాల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి.