News13th Aug 03:16 PMSunil Byrisetty1 min read
పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా
ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13వ తేదీతో ముగిశాయి. ఈ సమావేశాల్లోనే వందేమాత
ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13వ తేదీతో ముగిశాయి. ఈ సమావేశాల్లోనే వందేమాతరానికి చట్టపరంగా రక్షణ కల్పించే శాసనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఈ ఆరు చరణాల గీతాన్ని ఆలపించారు. వందేమాతరం ఆలపించడాన్ని అడ్డుకోవడం లేదా నిరోధించడం శిక్షార్హమైన నేరమని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఈ గీతానికి జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన హోదా లభించినట్లు అయింది. ఆరు చరణాలను పూర్తిగా ఆలపించిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో వర్షాకాల సమావేశాలు ముగిసినట్లు అయ్యింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకావిష్కరణ, గవర్నర్ల ప్రసంగం వంటి సందర్భాల్లో వందేమాతరంలోని ఆరు చరణాలను ఆలపించాలని జనవరి 28న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.