News17th Jul 03:12 PMSunil Byrisetty1 min read
21 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 8 కీలక బిల్లులు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ ముందుకు వెళ్లే 8 బిల్లులు ఇ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశ పెట్టనుంది.
పార్లమెంట్ ముందుకు వెళ్లే 8 బిల్లులు ఇవే..
* వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2025
* పబ్లిక్ ట్రస్ట్ (నిబంధనల సవరణ) బిల్లు 2025
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025
* పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025
* జియో-హెరిటేజ్ సైట్స్ & జియో-రిమైన్లు (సంరక్షణ-నిర్వహణ) బిల్లు 2025
* గనులు-క్వారీలు (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు 2025
* జాతీయ క్రీడా పరిపాలన బిల్లు 2025
* జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025
వీటితోపాటు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగించడంపైనా బిల్లు ఉండనుందని తెలుస్తోంది.