News19th Dec 03:01 PMSunil Byrisetty1 min read

ముగిసిన పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 15 రోజులపాటు సమావేశాలు కొనసాగాయి. సమావేశాల సందర్భంగా లోక్‌సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.

ముగిసిన పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 15 రోజులపాటు సమావేశాలు కొనసాగాయి. సమావేశాల సందర్భంగా లోక్‌సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ‘వీబీ జీ రామ్‌ జీ’ పేరుతో తీసుకువచ్చిన బిల్లు, అణు ఇంధన రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచే బీమా సవరణ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ ఆమోదించింది. అలాగే మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(రెండవ సవరణ)బిల్లు 2025, సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు 2025, ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025, జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, దివాళా, దివాళా కోడ్ (సవరణ) బిల్లులు ఆమోదం పొందాయి. పారదర్శకంగా భూసేకరణ కోసం జాతీయ రహదారుల(సవరణ) బిల్లు, కంపెనీల చట్టం సవరించడానికి కార్పొరేట్ చట్టలు(సవరణ) బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
India Politics
Parliament Session
Winter Session
Lok Sabha
Indian Parliament
Key Bills
ప్రభుత్వ సంస్కరణలు
భారత రాజకీయాలు
బిల్లుల ఆమోదం
పార్లమెంట్
Scroll for the next article