News14th Aug 04:03 PMSunil Byrisetty1 min read

FCRA బిల్లుపై పార్టీలు వైఖరి చెప్పాలి

FCRA బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ పార్టీలు తమ వైఖరిని ప్రజలకు స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్ర

FCRA బిల్లుపై పార్టీలు వైఖరి చెప్పాలి
FCRA బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ పార్టీలు తమ వైఖరిని ప్రజలకు స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థపై కత్తి పెడుతుంటే రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ FCRA బిల్లుకు మద్దతు తెలిపిందని, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు ఎందుకు మద్దతు ఇస్తున్నారో జనసేన నాయకత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జనసేన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ మతాలకు సంబంధించిన అంశాలపై వ్యాసాలు రాస్తున్నారని, అయితే దేశ ప్రజలకు సంబంధించిన కీలకమైన FCRA బిల్లుపై జనసేన వైఖరిని మాత్రం ఎందుకు వెల్లడించడం లేదని శివాజీ ప్రశ్నించారు. బీజేపీకి తోక పార్టీగా కాకుండా, FCRA బిల్లుపై టీడీపీ మీ స్వతంత్ర వైఖరిని స్పష్టం చేయలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
FCRA Bill
Congress
Andhra Pradesh Politics
Jana Sena Party
TDP
BJP
Kolankonda Shivaji
లింగమనేని రమేష్
పార్లమెంట్
రాజకీయ పార్టీలు
ఏపీ రాజకీయాలు
Scroll for the next article