Politics28th Dec 01:04 PMSunil Byrisetty1 min read

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి పునాదులు

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ పునాదులని, కష్టపడుతూ చురుకుగా పనిచేసే కార్యకర్తలకు తగిన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం ఉమ

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి పునాదులు
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ పునాదులని, కష్టపడుతూ చురుకుగా పనిచేసే కార్యకర్తలకు తగిన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాల పంపిణీ జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకుగాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసా పత్రాలు ఇచ్చి మరింత ప్రోత్సహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పాలనను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంలో నాయకులు, కార్యకర్తలు పోటీపడాలన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో కొనసాగాలని ప్రోత్సహిస్తూ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జి లతోపాటు పలువురు కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
Andhra Pradesh
Telugu Desam Party
TDP
Party Workers
Grassroots Leadership
Vasamsetti Subhash
Chandrababu Naidu
Nara Lokesh
సుపరిపాలన
ప్రజా సంక్షేమం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article