Politics19th Sep 01:17 PMSunil Byrisetty1 min read
కార్యకర్తలే కాంట్రాక్టర్లు.. ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం
కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని టీడీపీ బహిరంగ సభల్లో పార్టీ అధినేత చంద్రబాబు చెబుతూ ఉంటారు. అయితే కార్యకర్తలే కాంట్రాక్టర్లు అంటూ ఒక ఎమ్మెల్యే ప్రకటించారు. పార్టీ కోసం నిరంతరం శ్ర
కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని టీడీపీ బహిరంగ సభల్లో పార్టీ అధినేత చంద్రబాబు చెబుతూ ఉంటారు. అయితే కార్యకర్తలే కాంట్రాక్టర్లు అంటూ ఒక ఎమ్మెల్యే ప్రకటించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ, కష్టకాలంలో అండగా నిలిచిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పెద్దపీట వేస్తూ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. "పార్టీకి అసలైన వెన్నెముక కార్యకర్తలే" అని స్పష్టం చేస్తూ, నియోజకవర్గంలో జరిగే స్థానిక అభివృద్ధి పనుల నిర్వహణ బాధ్యతలను కార్యకర్తలకే అప్పగించే సరికొత్త విధానాన్ని ప్రకటించారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే పనులు పరిమితం కాకుండా, స్థానికంగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను భాగస్వామ్యం చేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేస్తానని ప్రకటించారు.