News30th Jul 03:11 PMSunil Byrisetty1 min read

రైలుపై మంటలు.. ప్రయాణికులు షాక్!

రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న రైలుపై నిప్పు రవ్వలు ఎగసిపడటంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదం కోల్‌కతా దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైలుపై ఉన్న విద్యుత్ తీగల్ల

రైలుపై మంటలు.. ప్రయాణికులు షాక్!
రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న రైలుపై నిప్పు రవ్వలు ఎగసిపడటంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదం కోల్‌కతా దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైలుపై ఉన్న విద్యుత్ తీగల్లో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు ఆందోళనకు గురై రైలు నుంచి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. దీంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించినవా లేక ఏదైనా కుట్ర కోణం ఉందా అనేది విచారణలో తేలనుంది.
India news
Kolkata
Dakshineswar Railway Station
Indian Railways
Train Fire
Railway Safety
షార్ట్ సర్క్యూట్
మంటలు
ప్రయాణికులు
రైల్వే భద్రత
పశ్చిమ బెంగాల్
Scroll for the next article