National24th Jul 04:35 PMSunil Byrisetty1 min read
14 ఏళ్ల తర్వాత పాస్ పోర్ట్ ఫీజుల సవరణ!
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వెరిఫికేషన్ సమయాన్ని మినహాయించి పాస్‌పోర్ట్ జారీకి సగటున 2023లో 11 రోజులు, 2024లో 11 రోజులు, 2025లో 13 రోజులు పట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వెరిఫికేషన్ సమయాన్ని మినహాయించి పాస్‌పోర్ట్ జారీకి సగటున 2023లో 11 రోజులు, 2024లో 11 రోజులు, 2025లో 13 రోజులు పట్టినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ కార్యాలయాలు, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు సమర్థవంతంగా సేవలు అందిస్తున్నాయని పేర్కొంది. 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పాస్‌పోర్ట్ మరియు సంబంధిత సేవల ఫీజులను సవరించినట్లు కేంద్రం తెలిపింది. పాస్‌పోర్ట్ బుక్‌లెట్ తయారీ, ముద్రణ, సేవల నిర్వహణ, పోలీసు వెరిఫికేషన్, పోస్టల్ సేవలు, ఈ-పాస్‌పోర్ట్ ప్రాజెక్టు, సాంకేతిక మౌలిక వసతులు, సిబ్బంది వేతనాలు తదితర వ్యయాలు పెరగడం వల్ల ఫీజుల సవరణ అవసరమైందని వివరించింది. 2012 తర్వాత దాదాపు 14 సంవత్సరాల అనంతరం ఈ ఫీజుల సవరణ చేపట్టినట్లు కేంద్రం స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ సేవలను మరింత నాణ్యంగా, సురక్షితంగా, వేగవంతంగా అందించేందుకు Passport Seva Programme 2.0 మరియు ఈ-పాస్‌పోర్ట్ అమలు చేయడం కూడా వ్యయాలు పెరగడానికి కారణమని పేర్కొంది.