Crime12th Apr 11:57 AMSunil Byrisetty1 min read
పాస్టర్ ప్రవీణ్ మృతి.. తాగి పడిపోయాడన్న పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఐజీ అశోక్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో, క్రైస్తవ సంఘాల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటితోపాటు పోస్టుమార్టం, ఫోర
పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఐజీ అశోక్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు.
ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో, క్రైస్తవ సంఘాల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
వీటన్నింటితోపాటు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఐజీ అశోక్ వాస్తవాలను బహిర్గతం చేశారు.
ప్రవీణ్‌కు సంబంధించి పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు.
ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని తెలిపారు.
సోషల్ మీడియాలో మాట్లాడినవారు ఎలాంటి ఆధారాలూ ఇవ్వలేదన్నారు.
దారిలో హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం షాపులకు వెళ్లారని, దారిలో ప్రవీణ్‌కు మూడుసార్లు చిన్నచిన్న ప్రమాదాలు జరిగాయని వివరించారు.
విజయవాడలో ట్రాఫిక్ ఎస్ఐ కండిషన్ బాగాలేదు, వెళ్లవద్దని చెప్పినా ప్రవీణ్ ముందుకెళ్లారని గుర్తు చేశారు.
హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించారని, ఏలూరులో మూడోసారి పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారని స్పష్టం చేశారు.
ప్రమాదస్థలంలో ప్రవీణ్ బుల్లెట్ రోడ్డు పక్కకు దూసుకుపోయిందని, ఆయన బుల్లెట్‌ను ఏ వాహనం కూడా ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని తెలిపారు.
ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతూ కంకర రాళ్లు ఉన్నాయని, బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్‌పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందని వెల్లడించారు.
ప్రమాదం ప్రవీణ్ శరీరంలో మద్యం ఉందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని ఐజీ అశోక్ స్పష్టం చేశారు