Crime3rd Apr 12:12 PMSunil Byrisetty2 min read

సొంత దర్యాప్తులు వద్దు.. ప్రవీణ్ ప్రతిష్టను దెబ్బతీయొద్దు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ఘటనపై సోషల్ మీడియాలో ఇష్టానుసారం ప్రచారం చేయవద్దని ప్రవీణ్ బార్య జెస్సికా, సోదరుడు కిరణ్ కోరారు. వారు విడుదల చేసిన వేర్వేరు వీడి

సొంత దర్యాప్తులు వద్దు.. ప్రవీణ్ ప్రతిష్టను దెబ్బతీయొద్దు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ఘటనపై సోషల్ మీడియాలో ఇష్టానుసారం ప్రచారం చేయవద్దని ప్రవీణ్ బార్య జెస్సికా, సోదరుడు కిరణ్ కోరారు. వారు విడుదల చేసిన వేర్వేరు వీడియోల్లో ప్రవీణ్ మృతిపై ప్రభుత్వ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ప్రచారం వద్దన్నారు. కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రవీణ్ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దర్యాప్తు సమయంలో మీ సహకారం కోరుకుంటున్నాను. ప్రవీణ్ మరణంపై పూర్తి దర్యాప్తు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దర్యాప్తు జరుగుతున్న సందర్భంగా అందరికీ విజ్ఞప్తి.. కొందరు ప్రవీణ్ మరణంపై స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ను నిలిపివేయండి. ఎందుకంటే ఇది ప్రవీణ్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కొంతమంది యూట్యూబర్లు , బ్లాగర్లు అతని మరణంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు దీనిని మతపరంగా, రాజకీయపరంగా వినియోగించుకుంటున్నారు. ప్రవీణ్ సమాజంలో మత సామరస్యాన్ని కాపాడాలని భావించేవారు. ఆయన సేవలను గౌరవించేందుకు, దయచేసి ఇటువంటి కార్యకలాపాలను నిలిపివేయండి. ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది. అందువల్ల దయచేసి మత సామరస్యాన్ని భంగం కలిగించకండ"ని -ప్రవీణ్ సోదరుడు, కిరణ్ కుటుంబ సభ్యులు కోరారు. అలాగే "నా భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్‌ మరణాన్ని కొందరు వాడుకుంటున్నారు. యేసు మార్గాన్ని అనుసరించేవారు మతవిద్వేషాలు ఎట్టిపరిస్థితుల్లో రెచ్చగొట్టరు. నా భర్త ప్రవీణ్‌ ఎప్పుడూ మతసామరస్యాన్నే కోరుకునేవారు. నా భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై మాకు పూర్తి నమ్మకం ఉంది. పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుంది. ప్రవీణ్‌ మృతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం చాలా దారుణమ"ని ప్రవీణ్ భార్య జెస్సికా వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రవీణ్ మరణంపై విచారణ తుది దశకు చేరినట్లు తెలుస్తోంది.
Mystery Death
Pastor
Praveen Pagadala
సోషల్ మీడియా
ప్రవీణ్ మృతి
సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్
Scroll for the next article