Politics3rd May 01:38 PMSunil Byrisetty1 min read
ప్రధాని మోదీ సభ.. ఏపీలో బాహుబలి త్రీ!
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మోదీ మూడుసార్లు ఏపికి వచ్చారని, అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం తెలిపారు. మోదీ సభను బాహ
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మోదీ మూడుసార్లు ఏపికి వచ్చారని, అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం తెలిపారు.
మోదీ సభను బాహుబలి త్రీగా ప్రజలు చెబుతున్నారన్నారు.
మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిస్తే రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు.
వారి ముగ్గురి కలయిక చూసి కాంగ్రెస్, వైసిపి నాయకుల్లో భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసిపి వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైసిపి, కమ్యూనిస్టు పార్టీల నేతలు అభివృద్ధి నిరోధకలుగా మారారన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు కాకుండా ఏదేదో ప్రకటనలు చేస్తున్నారని, షర్మిల నోటి కొచ్చిన విధంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రాష్ట్రానికి గ్రహణం వీడిందని మోదీ అన్నారంటే... వైసిపి వాళ్లు సిగ్గుపడాలని సూచించారు.