News16th Oct 04:19 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగుల భద్రత కమిటీలు
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు ఏర్పడ్డాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల మేరకు రోగుల భద్రతకు ప్రత్యేక అధికారులను నియమించడంత
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు ఏర్పడ్డాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల మేరకు రోగుల భద్రతకు ప్రత్యేక అధికారులను నియమించడంతోపాటు, 11 కీలక అంశాలపై పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. డీఎంఈ డాక్టర్ విష్ణువర్దన్ ఆదేశాల మేరకు వీటి ఏర్పాటు రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో జరిగింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు సురక్షితమైన వైద్య సేవలు అందించడం, చికిత్స సమయంలో పొరపాట్లు, నివారించదగిన ప్రమాదాలను తగ్గించడం రోగుల భద్రతలో కీలకం. మందుల వినియోగం, శస్త్రచికిత్సలు, రక్త మార్పిడి, వైద్య పరికరాల వినియోగం, ప్రయోగశాల పరీక్షలు, ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణ వంటి అంశాల్లో భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ కమిటీలు దోహదపడతాయి. మొత్తం 11 అంశాలను కమిటీ పర్యవేక్షిస్తుంది. ప్రతి అంశానికి సంబంధిత వైద్య ప్రత్యేక విభాగం నుంచి ఒక అధ్యాపకుడిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు.