News26th Jul 03:01 PMSunil Byrisetty1 min read

కృష్ణా డెల్టాకు సంజీవని పట్టిసీమ!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందు చూపునకు, రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి పట్టిసీమ ప్రత్యక్ష నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని శివగంగ-బొ

కృష్ణా డెల్టాకు సంజీవని పట్టిసీమ!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందు చూపునకు, రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి పట్టిసీమ ప్రత్యక్ష నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలోని శివగంగ-బొబ్బిలివాగు డ్రెయిన్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. బందరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.6.50 కోట్ల వ్యయంతో కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులు పూర్తి చేశాం. ఇప్పుడు రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులతో ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఈ డ్రెయిన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి సాగుకు అనుకూల వాతావరణం కల్పిస్తాం. రైతుల భాగస్వామ్యంతో పనుల్ని వేగవంతం చేస్తాం. శివగంగా బొబ్బిలి వాగు డ్రైన్ మరమ్మత్తుల వల్ల మచిలీపట్నంతో పాటుగా చల్లపల్లి, పెడన నుండి శివగంగ కు వచ్చే డ్రైన్ వాటర్ పారుదలకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఎల్ నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
Andhra Pradesh
Machilipatnam
Pattiseema Project
Krishna Delta
Kollu Ravindra
N Chandrababu Naidu
Irrigation
వ్యవసాయం
జలవనరులు
ఎల్ నినో
ఏపీ ప్రభుత్వం
కృష్ణా జిల్లా
మౌలిక సదుపాయాలు
Scroll for the next article