News10th Oct 04:42 PMSunil Byrisetty1 min read
పట్టిసీమతో రూ.50 వేల కోట్ల సంపద సృష్టి.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర రైతాంగానికి వరప్రదాయినిగా మారిందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, అపార అనుభవానికి సజీవ సాక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. సా
పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర రైతాంగానికి వరప్రదాయినిగా మారిందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, అపార అనుభవానికి సజీవ సాక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. సాగు నీటి సంఘాల అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లతో కలసి మంత్రి నిమ్మల మాట్లాడారు. 2015 నుంచి ఇప్పటి వరకు 500 టీఎంసీల గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడం ద్వారా సుమారు రూ.50 వేల కోట్ల సంపద సృష్టించబడిందని వివరించారు. రూ.1,600 కోట్ల వ్యయంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నేడు రాష్ట్రంలో రూ.50,000 కోట్ల సంపద సృష్టి జరిగిందని, ఇది తక్కువ పెట్టుబడితో అద్భుత ఫలితాలు సాధించిన ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడారు. వర్షపు చుక్క కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత ‘సూపర్ ఎల్ నినో’ విపత్కర పరిస్థితుల్లో సైతం గోదావరి నుంచి 57 టీఎంసీల నీటిని తరలించి కృష్ణా డెల్టాలో సుమారు 7 లక్షల ఎకరాల ఆయకట్టును కాపాడటంతో పాటు 30 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడం జరిగిందని తెలిపారు.