News11th Jul 05:02 PMSunil Byrisetty1 min read

చంద్రబాబు దూరదృష్టికి నిలువుటద్దం పట్టిసీమ

ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో 2015లో పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశారని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అ

చంద్రబాబు దూరదృష్టికి నిలువుటద్దం పట్టిసీమ
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో 2015లో పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశారని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను అందించటం ద్వారా కృష్ణా డెల్టా సస్యశ్యామలమైందని తెలిపారు. కృష్ణాజిల్లాలోకి పోలవరం కుడికాలువ 129 కి.మీ. బ్రిడ్జిదగ్గర పైనుంచి వస్తున్న గోదావరి జలాలకు జలహారతి సమర్పించారు. పట్టిసీమద్వారా ఇప్పటివరకు 443 టి.ఎం.సి.ల గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు అందించడం జరిగిందన్నారు. కృష్ణా డెల్టాలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 13 లక్షల ఎకరాల్లో ఉన్న వరి, చేపల చెరువులు, రొయ్యల చెరువులకు సాగునీరు ఇవ్వటం వల్ల భారతదేశ జి.డి.పి.లో కృష్ణాజిల్లా 2వ స్థానంలో నిలిచిందన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Pattiseema Project
Krishna River
Godavari River
River Linking
Andhra Pradesh
Irrigation
Krishna Delta
పోలవరం కుడి కాలువ
వ్యవసాయం
జలవనరులు
Scroll for the next article