Politics27th Mar 01:00 PMSunil Byrisetty1 min read

హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదన్న జగన్

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూట

హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదన్న జగన్
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎక్స్‌లో మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. 'ఆలయాల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధి కూటమి సర్కారుకు లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ సర్కార్ ఎంతో కృషి చేసింది' అని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేలులోని కాశినాయన క్షేత్రంలో ఇటీవల అటవీ శాఖ అధికారులు కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశం కడప నుంచి ఢిల్లీ వరకు కలకలం రేపింది. దీంతో మంత్రి లోకేష్ స్పందించి, సొంత నిధులతో భవనాలు నిర్మిస్తానని ప్రకటించారు.
Jagan
Pawan Kalyan
Hinduism
AP news
Scroll for the next article