Entertainment10th Nov 11:53 AMSunil Byrisetty1 min read
పవన్, అన్నా బంధానికి ముంగింపు..!
పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్‌లో అత్యంత పటిష్టమైన స్థితిలో ఉన్న సమయంలో విడాకుల ప్రకటన రాజకీయ ప్రత్యర్థులకు విమర్శనాస్త్రంగా మారే అవకాశం ఉంది. అయితే, బలవంతంగా బంధాన్ని కొనసాగించడ
పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్‌లో అత్యంత పటిష్టమైన స్థితిలో ఉన్న సమయంలో విడాకుల ప్రకటన రాజకీయ ప్రత్యర్థులకు విమర్శనాస్త్రంగా మారే అవకాశం ఉంది. అయితే, బలవంతంగా బంధాన్ని కొనసాగించడం కంటే పరస్పర గౌరవంతో విడిపోతూ, పిల్లల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తూ హుందాగా ప్రకటన విడుదల చేయడం ఆధునిక, పరిపక్వ ఆలోచనా విధానానికి నిదర్శనమని భావించవచ్చు. పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నెవా 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు చెబుతూ పరస్పర గౌరవంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. విడిపోయినా మంచి స్నేహితులుగా ఉంటాం, పిల్లల భవిష్యత్తు, సంక్షేమమే మా ఉమ్మడి ప్రాధాన్యమని పేర్కొన్నారు. తీన్‌మార్ సినిమా షూటింగ్ సమయంలో పరిచయమైన అన్నా లెజ్నెవాను పవన్ కళ్యాణ్ 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. వాస్తవానికి 2023 జూలై సమయంలోనే వీరిద్దరూ విడిపోతున్నారని, పిల్లలతో కలిసి ఆమె సింగపూర్ వెళ్లిపోయారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ సమయంలో వారాహి యాత్రలో భాగంగా దెందులూరు సభలో పవన్ స్వయంగా స్పందించారు. తన రాజకీయాల వల్ల భార్య, కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని, రావణాసురుడు సీతమ్మను లాగినట్లు తన భార్యను కూడా రాజకీయ విమర్శల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎట్టకేలకు విడాకులపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు.