Politics15th Mar 01:33 PMSunil Byrisetty1 min read
పవన్ కళ్యాణ్‌కు దళపతి విజయ్ కౌంటర్
తమిళ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, ఆంధ్రా ఉపముఖ్యమంత్రి, తెలుగు నటుడు పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిందీ భాష వద్దు కానీ హిం
తమిళ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, ఆంధ్రా ఉపముఖ్యమంత్రి, తెలుగు నటుడు పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిందీ భాష వద్దు కానీ హిందీ సినిమాలు డబ్ చేసి డబ్బు తీసుకుంటారా అని విజయ్ ని ప్రశ్నించారు. సంస్కృతం, హిందీ, తమిళం, తెలుగు అన్నీ దేశ భాషలే కదా అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై దళపతి విజయ్ తాజాగా కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమమనే భావన వచ్చిందని ఎద్దేవా చేశారు.
ఆవిర్భావ సభ జనసేనదైతే ఎజెండా బీజేపీదిలా ఉందని కౌంటరిచ్చారు. ఇతర రాష్ట్రాల భాషలపై తమకూ గౌరవం ఉందన్నారు.
అలా అని భాషని తమపై రుద్దాలని చూడటం సరికాదని కుండ బద్దలు కొట్టారు.
మన తమిళ, తెలుగు మలయాళ భాషలను ఆయా హిందీ భాషలు ఉన్న రాష్ట్రంలో 3 భాషగా పరిగణిస్తారా అని పవన్‌ను ప్రశ్నించారు దళపతి విజయ్.