Politics10th Jul 12:53 PMSunil Byrisetty1 min read
స్థానిక సమరానికి జనసేన సై
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ లోపే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతాయని చెప్పారు. నాయకులంతా సిద్ధం
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ లోపే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతాయని చెప్పారు. నాయకులంతా సిద్ధంగా వుండాలని కోరారు. కేడర్‌ను సిద్ధం చేయాలని పవన్ ఆదేశించారు. తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ ఆదేశాలిచ్చారు. ఇటీవల కాలంలో జనసేన పార్టీ నిర్మాణంపై పవన్‌కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైన రెండేళ్ల తర్వాత వస్తున్న ఎన్నికలు కావడంతో జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన తరహాలో స్థానికంలోనూ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.