News25th Jul 04:42 PMSunil Byrisetty1 min read

వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్

వర్షపాతం, నేలలో తేమ వంటి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్ పవన్ కళ్యాణ్ స్పష్టం చ

వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్
వర్షపాతం, నేలలో తేమ వంటి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అడవులు క్షీణించిన ప్రాంతాల్లో సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు మరిన్ని డ్రోన్ల సహాయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుద్ధరణ, 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం అత్యంత కీలక ప్రక్రియ అని తెలిపారు. జిల్లాల వారీగా సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమం, డ్రోన్ సాంకేతికత వినియోగంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియ పూర్తయ్యింది? డ్రోన్ల సాయంతో ఎంత విస్తీర్ణంలో సీడ్ బాల్స్ జారవిడిచారు? తదుపరి లక్ష్యాలు తదితర అంశాలను వివరించారు.
Andhra Pradesh
Pawan Kalyan
Seed Balls
Drone Technology
Afforestation
Forest Restoration
Green Cover
పర్యావరణ పరిరక్షణ
వృక్షారోపణ
అటవీ సంరక్షణ
పర్యావరణం
Scroll for the next article