News21st Aug 10:54 AMSunil Byrisetty1 min read
అటవీ అధికారులపై ఎమ్మెల్యే దాడి.. పవన్ సీరియస్
ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని హెచ్చరించారు. శ్రీశైలం అటవీ ప్రాం
ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని హెచ్చరించారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందించారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలన్నారు. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.