News19th Sep 11:25 AMSunil Byrisetty1 min read
నియోజకవర్గాల్లో సమస్యలపై నివేదిక ఇవ్వండి
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులపై కూడా చర్చించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన శాసన సభపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మె
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులపై కూడా చర్చించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన శాసన సభపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ‘ఎమ్మెల్యేలంతా సభలో జరిగే చర్చల్లో కచ్చితంగా పాల్గొనాలి. సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం చేయవద్దు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడితేనే ప్రజలు మళ్లీ చాన్స్ ఇస్తారు. కాబట్టి ఎమ్మెల్యేలు అన్ని అంశాలపై అవగాహన కల్పించుకుని సభలో జరిగే చర్చల్లో పాల్గొనాల’ని పవన్ సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పలు సూచనలు చేశారు.