News23rd Sep 12:19 PMSunil Byrisetty1 min read
తుపాను హెచ్చరికలపై పవన్ కల్యాణ్ సూచనలు
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి 'పవన్ కల్యాణ్' ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి 'పవన్ కల్యాణ్' ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. దెబ్బతినే అవకాశం ఉన్న గ్రామీణ రహదారులు, కల్వర్టులపై ముందస్తు చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.