News8th Dec 12:46 PMSunil Byrisetty1 min read

మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి

సనాతన ధర్మం ఎప్పటికీ మూఢనమ్మకానికి ప్రతీక కాదు, అది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవజాతికి అందించిన మార్గదర్శి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇతర

మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి
సనాతన ధర్మం ఎప్పటికీ మూఢనమ్మకానికి ప్రతీక కాదు, అది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్త్రీయ రూపంలో మానవజాతికి అందించిన మార్గదర్శి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇతరులు మన ధర్మం మీద దాడులు చేస్తున్నారని అనడం కంటే ముందు మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ఇతరులు మనపై దాడి చేయకుండా గళమెత్తాలన్నారు. తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతీ హిందువులో చైతన్యం రావాలన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రాన్ని దర్శించారు. కనక కిండి ద్వారా శ్రీ కృష్ణ భగవానుడిని దర్స్మిచుకున్నారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం అందుకున్నారు. ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారు పవన్ కళ్యాణ్ కి ‘అభినవ శ్రీకృష్ణదేవరాయ’ బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టి.టి.డి.బోర్డు సభ్యులు బి.ఆనంద్ సాయి పాల్గొన్నారు.
Andhra Pradesh
Pawan Kalyan
Sanatana Dharma
Hindu Culture
Spirituality
Udupi Sri Krishna
Brhath Geetotsav
Sugunendra Teertha Swamiji
అభినవ శ్రీకృష్ణదేవరాయ
టిటిడి
ధార్మిక చైతన్యం
Scroll for the next article