Politics22nd Apr 05:52 PMSunil Byrisetty1 min read

పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పీఠాధిపతి అంటూ వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ ఆరె శ్యామల ఎద్దేవా చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారనే వార్తలపై ఈ

పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం పీఠాధిపతి అంటూ వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ ఆరె శ్యామల ఎద్దేవా చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారనే వార్తలపై ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్ మీ ఇలాకా పిఠాపురంలో దళితుల దుస్థితి ఇది... సిగ్గుపడాలి’ అంటూ తీవ్రంగా స్పందించారు. పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు విద్యుత్ షాక్‌తో మరణించాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరిన దళితులను మల్లాం గ్రామస్తులు వెలివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని కనీసం పొలం పనులకు కూడా పిలవడం లేదని, వారికి పాలు కూడా అందనీయడం లేదన్నారు. పిఠాపురం ప్రజలకు న్యాయం చేయడం అంటే ఇదేనా అంటూ శ్యామల ప్రశ్నించారు. శ్యామల వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Pithapuram
Pawan Kalyan
Shyamala
Social boycott
Dalit issues
పవన్ కల్యాణ్ పిఠాపురం పీఠాధిపతి
పిఠాపురంలో దళితుల దుస్థి
దళితులను మల్లాం గ్రామస్తులు వెలి
Scroll for the next article