News23rd Nov 02:43 PMSunil Byrisetty1 min read
పార్టీ పటిష్టంపై పవన్ దృష్టి !
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర స్థాయి కమిటీ నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూలై 2024లో మొదటి దశగా రాష్ట్ర కమిట
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర స్థాయి కమిటీ నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూలై 2024లో మొదటి దశగా రాష్ట్ర కమిటీని ప్రకటించారు, ఇప్పుడు గ్రామ స్థాయిలోనూ పార్టీని బలోపేతం చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయ బృందం ఇటీవల వివిధ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, వీరమహిళలతో సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించింది. ఈ డేటాను ఆధారంగా చేసుకుని, కమిటీల కూర్పును రూపొందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కార్యకర్తల మనోభావాలను గుర్తించాలి. వారి భావాలకు అనుగుణంగా మాత్రమే ముందుకు సాగాలి. ఇది పార్టీ బలానికి కీలకమని పవన్ భావిస్తున్నారు. ఉమ్మడి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉందని, అక్కడి నాయకత్వాన్ని మరింత పటిష్ఠం చేసి కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో ఎన్నికల సమయంలో జనసేన గెలుపులు సాధించడమే కాకుండా, పార్టీ క్షేత్ర స్థాయి బలాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.