News19th Oct 02:50 PMSunil Byrisetty1 min read

రోడ్డు ధ్వంసం చేస్తారా? పవన్ సీరియస్!

'పల్లె పండుగ' రోడ్డు ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలాంటి వారిపై 'నాన్‌ బెయిలబుల్‌ కేసు'లకు 'పవన్‌ కల్యాణ్‌' ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి జిల్

రోడ్డు ధ్వంసం చేస్తారా? పవన్ సీరియస్!
'పల్లె పండుగ' రోడ్డు ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలాంటి వారిపై 'నాన్‌ బెయిలబుల్‌ కేసు'లకు 'పవన్‌ కల్యాణ్‌' ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలో 'పల్లెపండుగ' రోడ్డును ధ్వంసం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేసినట్లు అధికారులు వెల్లడించారు. బాధ్యులపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రోడ్డు ధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద వసూలు చేయాలని అధికారులకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు.
Scroll for the next article