News4th Sep 01:51 PMSunil Byrisetty1 min read

పిఠాపురం టీచర్లకు పవన్ కానుక

పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు కానుక పంపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే ఉపా

పిఠాపురం టీచర్లకు పవన్ కానుక
పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు కానుక పంపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవం తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఆధ్యాపకులు 2 వేల మందికి పవన్ కల్యాణ్ కానుకలు పంపించారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టు అందజేశారు. వాటిని ప్రత్యేక టీమ్ పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల విద్యాశాఖ కార్యాలయాల్లో ఉదయాన్నే పంపిణీ చేసింది. డిప్యూటీ సీఎం కానుకలు పంపడంపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh
Pithapuram
Pawan Kalyan
Teachers Day
Teachers
Gifts
Government Schools
Private Schools
Junior Colleges
Deputy CM
Teacher Appreciation
Education
పిఠాపురం టీచర్లకు పవన్ కానుక
Scroll for the next article