Entertainment24th May 03:51 PMSunil Byrisetty1 min read

హరిహరవీరమల్లుపై కుట్ర? థియేటర్ల బంద్‌పై కదిలిన ప్రభుత్వం

జూన్ 12వ తేదీన సినీ నటులు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు చిత్రం విడుదలవుతున్న సందర్భంలో 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ చేయబోతున్నారన్న అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ ప్రచ

హరిహరవీరమల్లుపై కుట్ర? థియేటర్ల బంద్‌పై కదిలిన ప్రభుత్వం
జూన్ 12వ తేదీన సినీ నటులు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు చిత్రం విడుదలవుతున్న సందర్భంలో 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ చేయబోతున్నారన్న అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ ప్రచారంపై హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్ల బంద్ తెరపైకి రావడం వెనుక వ్యక్తులెవరు, జరుగుతున్నదేమిటనే అంశాలన్నింటిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను ఆరా తీసి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చిన విషయం గుర్తుచేశారు. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దీని వెనుక ఉన్న కారణాలను ఆరా తీస్తున్నామన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆమోదించి పెంచుతున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
Tollywood
Hari hara veera mallu
Pawan Kalyan
KandulaDurgesh
APCinemasCrisis
హరిహరవీరమల్లుపై కుట్ర
సినిమా థియేటర్ల బంద్
Scroll for the next article