News29th Jul 03:16 PMSunil Byrisetty1 min read
ప్రజల భద్రత, వన్యప్రాణుల సంరక్షణకు సమాన ప్రాధాన్యం
‘ప్రకృతి మనకు చెందినది కాదు.. మనమే ప్రకృతికి చెందినవాళ్లం. అందుకే ప్రకృతితో సామరస్యంగా జీవించాలి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉన్నప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుంద
‘ప్రకృతి మనకు చెందినది కాదు.. మనమే ప్రకృతికి చెందినవాళ్లం. అందుకే ప్రకృతితో సామరస్యంగా జీవించాలి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉన్నప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణపైనా ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అదే దృక్పథంతో మానవ, ఏనుగు సంఘర్షణలను తగ్గించడానికి గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల శిబిరాన్ని పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. అడవి ఏనుగుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించడం, ప్రజల ప్రాణాలు, రైతుల పంటలను రక్షించడం, దశాబ్దాల నుంచి ఉన్న మానవ–ఏనుగు సంఘర్షణను నివారించడమే లక్ష్యంగా ఈ శిబిరం పని చేయనుంది.
పవన్ మాట్లాడుతూ “అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించడం, రైతుల పంటలను ధ్వంసం చేయడం, ప్రజలు రాత్రివేళ భయాందోళనల మధ్య జీవించడం వంటి సమస్యలు పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో ఈ కేంద్రం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంద’ని పేర్కొన్నారు.