News20th May 03:46 PMSunil Byrisetty1 min read

రోహింగ్యాల వలసలతో భద్రతకు ప్రమాదం

‘సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకం. దీనిపైనే రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బంది

రోహింగ్యాల వలసలతో భద్రతకు ప్రమాదం
‘సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకం. దీనిపైనే రాష్ట్ర పోలీసులను, పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశాన’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తల్చుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని చెప్పారు. సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో, రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్‌గా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలసదారులు వచ్చారన్నారు. రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారని, మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహరిస్తున్న యంత్రాంగంపై కన్నేసి ఉంచాలని, అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు
Deputy CM Pawan Kalyan
Rohingya Migration
Operation Sindoor
Indian Army
ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలసదారులు
సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది
Scroll for the next article