News4th Nov 11:36 AMSunil Byrisetty1 min read

టెక్నాలజీతో అడవి ఏనుగుల కట్టడి

అడవి ఏనుగుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సౌరశక్తి ఆధారంగా పనిచేసే వినూత్న వ్యవస్థను చిత్తూరు జిల్లా

టెక్నాలజీతో అడవి ఏనుగుల కట్టడి
అడవి ఏనుగుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సౌరశక్తి ఆధారంగా పనిచేసే వినూత్న వ్యవస్థను చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా ఏనుగుల సంచారాన్ని ముందుగానే గుర్తించి, వాటిని భయపెట్టి తిరిగి అడవిలోకి పంపించడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఈ వినూత్న వ్యవస్థను ఏనుగులు సంచరించే మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. ఇది తన పరిధిలోకి ఏనుగు రాగానే గుర్తించి, వెంటనే తుపాకీ పేలినట్లు పెద్ద శబ్దాలు చేస్తుంది. ఆ శబ్దాలకు భయపడి ఏనుగులు వెనుదిరుగుతాయి. అదే సమయంలో అటవీ శాఖ అధికారులకు వెంటనే సంకేతాలు పంపి, వారిని అప్రమత్తం చేస్తుంది. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థ, ఏర్పాటు చేసిన ప్రాంతంలో 60 మీటర్ల పరిధిలో 120 డిగ్రీల కోణంలో నిరంతరం పర్యవేక్షిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Andhra Pradesh
Pawan Kalyan
Wild Elephants
Forest Department
Artificial Intelligence
Solar Technology
Chittoor District
Pilot Project
Wildlife Management
ప్రభుత్వ ప్రాజెక్ట్
అడవి రక్షణ
మానవ-వన్యప్రాణి ఘర్షణ
నూతన వ్యవస్థ
Scroll for the next article