News30th Dec 11:25 AMSunil Byrisetty1 min read
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పవన్
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.