Politics20th Mar 04:57 PMSunil Byrisetty1 min read
సైబరాబాద్‌తోపాటు దీనికీ చంద్రబాబేనన్న పవన్ కల్యాణ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ సృష్టి కర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ అన్నారు. దళితుల ఆత్మగౌరవ పోరాటంను ముందుకు తీసు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ సృష్టి కర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ అన్నారు.
దళితుల ఆత్మగౌరవ పోరాటంను ముందుకు తీసుకుని వెళ్లి ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. దేశ స్థాయిలో వర్గీకరణ చర్చకు.
వచ్చి ప్రధాన మంత్రి దృష్టిలో పడింది అంటే దీనికి బీజం ఆంధ్రప్రదేశ్ లోనే పడిందని చెప్పారు.
ఈరోజు అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా వర్గీకరణ చేయటం మేము మనస్పూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు.
మందకృష్ణ వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉద్యమానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. అనంతరం SC వర్గీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం పలికింది. వర్గీకరణ ప్రకారం
1.గ్రూప్ A (రెల్లి & సబ్ క్యాస్ట్ ) = 1%
2.గ్రూపు B (మాదిగ & సబ్ క్యాస్ట్ ) = 6.5%
3.గ్రూప్ C (మాల &సబ్ క్యాస్ట్ ) = 7.5%
1.మొదటి 100 రోస్టర్ పాయింట్స్‌లో గ్రూప్ A వారికి 1%, గ్రూప్ B వారికి 6%, గ్రూప్ C వారికీ 8% వస్తుంది
2. రెండవ 100 రోస్టర్ పాయింట్స్‌లో గ్రూప్ A వారికీ 1% గ్రూప్ B వారికీ 7%, గ్రూప్ C వారికి 7% వర్తిస్తుంది