News10th Sep 12:40 PMSunil Byrisetty1 min read
పవన్ ఫొటోలపై పిల్.. హైకోర్టులో విచారణ!
ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటో అంశంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచడాన్ని సవాల్ చేస్
ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటో అంశంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ను కొట్టివేసింది. డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేదం ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ పిల్ డిస్మిస్ చేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలని సూచన చేసింది.