News24th Aug 04:04 PMSunil Byrisetty1 min read

పులివెందులపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి

జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత ప్ర

పులివెందులపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి
జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించి నిర్లక్ష్యం చేసిన పథకాలకు సైతం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. దాదాపు రూ. 426 కోట్ల విలువైన 96 శాతం పనులు పూర్తి చేసి నిబద్ధత చాటుకున్నారు. ఏడు మండలాల పరిధిలో ఐదున్నర లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభమైన పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. వీటిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 280 కోట్లు ఒక్క పులివెందుల పథకానికే కేటాయించి వేగంగా పనులు చేపట్టారు.
Andhra Pradesh
Pawan Kalyan
Pulivendula
Mega Water Grid
Jal Jeevan Mission
Amarajeevi Jaladhara
Drinking Water Project
YSR Kadapa
Pulivendula Constituency
తాగునీటి సమస్య
వాటర్ గ్రిడ్
ఏపీ ప్రభుత్వం
జనసేన
ఆంధ్రప్రదేశ్ వార్తలు
గ్రామీణాభివృద్ధి
తాగునీటి పథకాలు
Scroll for the next article