News11th Oct 01:47 PMSunil Byrisetty1 min read
ఉప్పాడ తీర కాలుష్యంపై పవన్ సమీక్ష
కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంటున
కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంటున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై చర్చించారు. ప్రధానంగా పిఠాపురం నియోజక వర్గం పరిధిలో తీర ప్రాంత కాలుష్యం గురించి సమీక్ష సాగుతోంది. పవన్ కళ్యాణ్ కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాట.. మంతిలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు, వారు వెలిబుచ్చిన సందేహాలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకొంటున్నారు. పొల్యూషన్ ఆడిట్ కి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. కాకినాడ జిల్లాతోపాటు గోదావరి జిల్లాలలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై చర్చిస్తున్నారు.