News30th Jul 02:59 PMSunil Byrisetty1 min read

సూపర్ ఎల్ నినో భయం.. పవన్ తో మంత్రి భేటీ

సూపర్ ఎల్ నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఈ మేరకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో ఆయన

సూపర్ ఎల్ నినో భయం.. పవన్ తో మంత్రి భేటీ
సూపర్ ఎల్ నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఈ మేరకు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో ఆయన భేటీ అయ్యారు. సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని పవన్ సూచించారు. సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా తీసుకుంటే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట తదితర నియోజకవర్గాల రైతుల కోసం అడిగిన వెంటనే ఏలేరు ప్రాజెక్టు నుంచి వెంటనే 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని, కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మత్తులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని చెప్పారు.
Andhra Pradesh
Pawan Kalyan
Nimmala Ramanaidu
Super El Niño
Irrigation
Water Resources
Farmers
Agriculture
నీటి సంరక్షణ
కాకినాడ
పిఠాపురం
పెద్దాపురం
జగ్గంపేట
Scroll for the next article