News4th Sep 05:47 PMSunil Byrisetty1 min read
ఆడపడుచులకు శ్రావణ కానుక అందించిన పవన్!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో తన అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది మహిళ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో తన అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది మహిళలకు ఆయన చీరలు, పసుపు, కుంకుమలను పంపించారు. పిఠాపురంలోని ప్రముఖ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారి దివ్య సన్నిధిలో ఆడపడుచులందరి కోసం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని నిర్వాహకులు ఉచితంగా అందించడంతో పాటు వేద పండితుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ ఆధ్యాత్మిక క్రతువును కొనసాగించారు. వ్రతాన్ని ఆచరించేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా మహిళా భక్తులు తరలిరావడంతో, రద్దీకి అనుగుణంగా ఐదు విడతల్లో పూజలు పూర్తయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.