News21st Oct 04:10 PMSunil Byrisetty1 min read

భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక

భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల నుంచి ఈ మేరకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు.
Andhra Pradesh
Pawan Kalyan
Bhimavaram
DSP Jayasurya
West Godavari
Deputy CM
Law and Order
Police Misconduct
Gambling Camps
రాజకీయ ఆరోపణలు
ఎస్పీ విచారణ
ఆంధ్రప్రదేశ్
జనసేన
టీడీపీ కూటమి
Scroll for the next article