Politics11th Nov 12:00 PMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యేల పెత్తనంపై పవన్ సీరియస్
రాష్ట్రంలో చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, పార్టీలతో సంబంధం లేకుండా.. కూటమి ఎమ్మెల్
రాష్ట్రంలో చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులవుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, పార్టీలతో సంబంధం లేకుండా.. కూటమి ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించాలని కోరారు. భూవివాదాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా, ఆక్రమణలు కూడా చాలా తీవ్రమైన అంశమని, ఆయన ఆక్రమణలను స్వయంగా వీడియో తీశానని, త్వరలోనే విడుదల చేస్తానని తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తుంటే ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకుని చక్కదిద్దాలని సూచించారు.