News26th Sep 01:48 PMSunil Byrisetty1 min read
హైదరాబాద్‌కు పవన్.. తగ్గని జ్వరం
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారు. అందువల్లే గురువారం సచివాలయం వెనుక నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక పత్రాల
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారు. అందువల్లే గురువారం సచివాలయం వెనుక నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికీ హాజరు కాలేదు. జ్వరం తీవ్రత తగ్గలేదు. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అందుకోసం శుక్రవారం పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తారని ప్రకటనలో పేర్కొంది.